భార్యపై అనుమానం, బండరాయితో తలపై మోది హత్య
మద్యం మత్తులో భర్త తన భార్య తలపై బండ రాయితో మోది హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఏం జరిగిందంటే... భార్య జయలక్ష్మిపై ఎప్పటి నుంచో అతడికి అనుమానం ఉందట. అదనుకోసం ఎదురు చూసిన భర్త సతీష్... రాత్రి బంధువుల ఇంట్లో పడుకున్న సమయంలో మద్యం మత్తులో బండ రాయితో భార్య జయలక్ష్మి తలపై మోది హత్య చేసాడు.
తలకు బలమైన బలమైన గాయం అవ్వడంతో అక్కడిక్కడే జయలక్ష్మి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీరికి 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. 10 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చారు.
నిందితుడు సతీష్ మియాపూర్‌లో గోల్డ్ స్మిత్ పని చేస్తుంటే, మృతురాలు జయలక్ష్మి నిజాంపేట్, హిల్ కౌంటీ కాలనీలో హౌస్ కీపింగ్ సూపర్ వైజర్‌గా వర్క్ చేస్తుంది. భార్యపై అనుమానంతో నిత్యం వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.