శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (18:49 IST)

భూ వివాదంలో రేవంత్ రెడ్డి, అభియోగాలు నమోదు

గొపన్ పల్లి ల్యాండ్ వ్యహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో నమోదైన కేసులో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలీ పోలీసులు చార్జీ షీట్ వేశారు. ఈ ల్యాండ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు ఆయనతో పాటు పాటుగా కొండల్ రెడ్డి, లక్ష్మయ్య పేర్లను కూడా చార్జిషీట్లో చేర్చారు. సర్వే నెంబర్ 127 సంబంధించిన ల్యాండ్ కేసులో రేవంత్‌పై అభియోగాలు నమోదు చేశారు. అక్రమంగా మ్యుటేషన్ చేసిన అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిని సస్పండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే ఈ ల్యాండ్‌కు సంబంధించి ఇప్పటికీ తామే నిజమైన యాజమానులమంటూ కొందరు ముందుకు వచ్చారు. ఈ ల్యాండ్ విషయంలో గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 
2016లో గచ్చిబౌలీ పోలీసులకు పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. కొండల్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాజాగా డిప్యూటి కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో రేవంత్ రెడ్డికి సంబంధించి గోపన్‌పల్లి ల్యాండ్ వ్యవహారం వెలుగోకి వచ్చింది. 
 
సర్వే నెంబర్ 127లో కట్టడాలను రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా కూల్చివేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ వున్న గదిని రేవంత్‌ రెడ్డితో పాటు మరికొందరు వచ్చి కూల్చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలం వివాదానికి సంబంధించి రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి,  లక్ష్మయ్యల పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెద్ది రాజు. అయితే ఈ ల్యాండ్ తమదేనంటూ.. పెద్దిరాజుతో పాటుగా కొండల్ రెడ్డి కూడా వాదిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పది ఎకరాల ఈ భూమిలో కొంత భాగం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 2016 లోనే నమోదైన ఈ కేసులో పోలీసులు 2019లో చార్జీషీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించారు.