బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:37 IST)

కుమార్తెపై సవతి తండ్రి అత్యాచారం.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సవతి తండ్రిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని టప్పచాబూత్రాలో చోటుచేసుకుంది. ఇంట్లో తల్లి లేని సమయంలో 40 ఏళ్ల వ్యక్తి ఆమె కుమార్తె(13)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. కూతురు ఏడవడం చూసిన తల్లి ఏమైందని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. జ్యూడిషియల్‌ కస్టడి నిమిత్తం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.