బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (16:35 IST)

సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం

clap Minister Gangula Kamalakar
clap Minister Gangula Kamalakar
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి బిసి.వెల్ఫేయిర్ మరియు సివిల్ సప్లయిస్ మినిష్టర్ గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. 
 
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం అయ్యింది.  సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 
 
బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్ గా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.
 
మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని  రూపొందిందబడుతుంది. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు.