శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:05 IST)

#Ghaziabadలో ఘోరం.. శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు (video)

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోనూ పరిస్థితులు భయంకరంగా వున్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చికిత్సకు బెడ్స్ కూడా దొరకడం లేదు. చివరకు కరోనా మృతులతో శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. 
 
తాజాగా ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు పడివున్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
 
కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దహన సంస్కారాలపైనా ఆంక్షలు విధించారు. శ్మశాన వాటికలో ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే దహన సంస్కారాలు ఆలస్యమవుతున్నాయి. 
 
మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. ఆ మృతదేహాలతో శ్మశాన వాటిక ముందు బంధువులు పడిగాపులు గాస్తున్నారు. హిండన్ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో క్యూకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ షాకింగ్ దృశ్యాలను నెటిజన్లు చలించిపోతున్నారు. మన దేశానికి ఏంటీ దుస్థితి అని బాధపడుతున్నారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.