శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (19:08 IST)

హలో అన్నదమ్ములూ.... గృహాన్ని పంచుకుంటున్నారా.. జాగ్రత్త..?

సాధారణంగా చాలామంది గృహాల్లో గొడవలు ఎక్కువగా ఉంటాయి. గృహాన్ని పంచుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. దాంతో రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కుంటుంటారు. అయితే గృహాన్ని పంచుకోవడం మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
1. ప్రతీ గృహానికి గర్భగోడలు పూర్తిగా పై కప్పును తాకే విధంగా ఉండాలి. పిట్టగోడలు పనికిరావు. 
 
2. ఓ గృహాన్ని భాగాలు చేసి పంచుకోవడం కంటే.. ఇంటిని నేలమట్టం చేసి తిరిగి విడివిడిగా ఎవరికివారే ఇళ్ళు కట్టుకోవడం శ్రేష్టం.
 
3. కొందరు గృహగర్భగోడలను సగం వరకు కట్టుట లేదా అలంకరణ నిమిత్తం మధ్యలో ఆపివేయుట చేయుచున్నారు. ఇది నిషిద్ధమం.
 
4. ఒక గృహాన్ని 3 భాగాలుగా గానీ, 4 భాగాలుగా గానీ పంచుకోరాదు. ఇట్లు చేసినచో ఒక భాగస్తునకు దారిద్ర్యం గానీ, వంశక్షయం గానీ కలుగుట సంభవించును. అట్లే ఒక భాగస్తుడు బాగుండి మిగిలిన వారికి కష్టనష్టాలు కలుగుతాయి. 
 
5. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక, ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం.
 
6. గృహావరణంలో తూర్పు, ఉత్తర, ఈశాన్యాలలో పెద్ద పెద్దల దొడ్లు ఉంటే ఐశ్వర్యం, వంశవృద్ధి.