ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 27 మే 2019 (19:19 IST)

టూత్‌పేస్ట్ ముఖంపై ఉన్న మొటిమల్ని మచ్చల్ని తగ్గిస్తుందా?

చాలా మంది ముఖంలో మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో ఒకటి టూత్‌పేస్ట్ రాయడం. ఇలా టూత్‌పేస్ట్ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
మామూలుగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంతాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. దీనిని దంతాలపై రాస్తారు. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏమీ కాదు, కానీ ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి టూత్‌పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా భవిష్యత్తులో మాత్రం దాని తాలూకూ ఇబ్బందులు తప్పవు. 
 
పేస్ట్‌లోని కెమికల్స్ ముఖంపై ఉన్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తాయి. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా టూత్‌పేస్ట్‌ను ముఖంపై రాయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.