అండర్ ఆర్మ్స్ కింద నల్లగా వుంటే పోగొట్టేందుకు ఈ ఆకు చాలు
కొంతమంది స్త్రీలకు అండర్ ఆర్మ్స్ కింద నల్లటి మచ్చలు వస్తాయి. ఎలర్జీ లేదా శక్తివంతమైన డియోడ్రెంటులను వాడినప్పుడు తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నల్ల మచ్చలను వదిలించుకునేందుకు కలబంద ఆకు చాలు.
కలబంద ఆకును తీసుకుని తాజా కలబంద జెల్‌ను తీయాలి. ఈ జెల్ పొరను అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇంట్లో కలబంద మొక్క లేకపోతే ఆర్గానిక్ కలబంద జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు.
రోజు మార్చి రోజు ఇలా చేస్తుంటే నల్లమచ్చలు తగ్గుతాయి. అలోవెరా జెల్‌లో కనిపించే అలోసిన్ అనేది టైరోసినేస్ ఇన్హిబిటర్. ఇది చర్మపు పిగ్మెంటేషన్‌కు కారణమయ్యే ఎంజైమ్. కనుక అండర్ ఆర్మ్స్ కింద వున్న నల్ల మచ్చలను ఇది పోగొట్టకలదు.