బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (12:10 IST)

వంకాయ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలంటే?

వంకాయలు కట్ చేసినప్పుడు నల్లబడకుండా ఉండాలంటే నీళ్లలో కొద్దిగా పాలు కలుపుకుని వాటిని ఈ నీళ్లలో వేసుకుంటే నల్లబడవు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుకున్నా కూడా వాటికి మెుగ్గలు వస్తుంటాయి. అందుకు వీటితో పాటు

వంకాయలను కత్తిరించినపుడు నల్లబడకుండా ఉండాలంటే కొద్దిగా పాలు కలిపిన నీళ్ళలో వేసుకుంటే నల్లబడవు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుకున్నా కూడా వాటికి మెుగ్గలు వస్తుంటాయి. అందుకు వీటితో పాటు ఒక ఆపిల్‌ను కూడా ఉంచుకుంటే మెుగ్గలు రావు. బెండకాయల జిగురు పోవాలంటే వంట చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలుపుకోవాలి.
 
ఇలా చేయడం వలన బెండకాయల జిగురు పోతుంది. కాఫీ కప్పులకు మరకలు పోవాలంటే ఆ కప్పుల్లో సోడా నింపుకుని మూడ గంటల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. టమోటాలను తొడిమ కింది వైపుకు వచ్చేవిధంగా ఉంచుకుంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.