మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:09 IST)

అన్నం వండుకునే ముందు.. కొబ్బరినూనెను కలిపి?

శారీరక శ్రమతో పనిచేసేవారు అన్నం ఎంత తిన్నా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ కూర్చుని పని చేసేవారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. తత్ఫలితంగా కొవ్వు చేరి ఊబకాయానికి దారితీస్తుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 
 
పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు వచ్చే అనారోగ్యాల సంఖ్యను చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కార మార్గం దొరికింది. అన్నం వండుకునే ముందు బియ్యాన్ని కడిగి బియ్యం పరిమాణంలో మూడు శాతం ఉండేలా తినే కొబ్బరి నూనెను కలిపి ఉడికించండి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తదుపరి గోరు వెచ్చగా వేడి చేసి వెంటనే తినేయాలి. 
 
ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రెసిడెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. ఇలా పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల శరీరంలోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.