మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (15:03 IST)

జయహో భారత్ : న్యూజిలాండ్‌ చిత్తు.. పదేళ్ళ తర్వాత వన్డే సిరీస్

విదేశీ గడ్డపై భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించి కంగారులను కంగారెత్తించిన కోహ్లీ సేన.. ఇపుడు న్యూజిలాండ్‌లోనూ ఇదే జోరును కొనసాగిస్తోంది. ఫలితంగా పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై భారత జట్టు వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. 
 
కాగా, సోమవారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
భారత జట్టు ఓపెనర్లలో రోహిత్ శర్మ 62, శిఖర్ ధావన్ 28, విరాట్ కోహ్లీ 60, అంబటి రాయుడు 40, దినేష్ కార్తీక్ 38 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, కుమార్ 2, చాహల్ 2, పాండ్యా 2 చొప్పున వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు.