ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 మే 2022 (21:49 IST)

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే కరివేపాకు

curry leaves
కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగాసహాయపడుతుంది.
 
 
మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకుంటే... ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
 
కరివేపాకులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తినడం వల్ల కళ్లకు సంబందించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటిచూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
వెంట్రుకలు రాలడం, పలుచబడడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివేపాకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
 
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటుని నివారిస్తుంది.
 
అలాగే కరివేపాకుని ఒక మంచి సౌందర్య సాధనంగా కూడా చెప్పవచ్చు. కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, చర్మపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.