ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (18:10 IST)

ఫిల్టర్ కాఫీ తాగితే డయాబెటిస్ దూరమవుతుందా?

ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.

టైప్-2 డయాబెటిస్ ముప్పును నివారించడంలో ఫిల్టర్ కాఫీ బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. కొన్ని రోజుల పాటు ఫిల్టర్ చేసిన కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్-2 డయాబెటిస్ ముప్పు కొంత దూరమైందని తేలిందని పరిశోధకులు తెలిపారు. 
 
మధుమేహాన్ని నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చిందన్నారు. అయితే, వేడిచేసి తీసుకున్న కాఫీతో ఇలాంటి ఫలితం రాలేదన్నారు. రోజుకు రెండు, మూడు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 60 శాతం దూరమైనట్టు తేలింది.