శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 మే 2019 (22:05 IST)

అధిక బరువు తగ్గించే మాత్రలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాదపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం లోపం వలన, వాతావరణ కాలుష్యం ప్రభావం వంశపారంపర్యం మొదలైన కారణాల వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను నుండి తప్పించుకోవడానికి చాలామంది మందులు వాడతారు. దానివలన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ మాత్రలు వల్ల కలిగే సమస్యలు ఏమిటో చూద్దాం.
 
1. బరువు తగ్గించే మాత్రలను వాడటం వలన కలిగే సాధారణ సమస్య జీర్ణాశయ సమస్యలు. ఈ మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, గ్యాస్ మరియు విరేచనలు కలిగిస్తాయి. 
 
2. ఈ మాత్రలలో ఉండే సమ్మేళనాల కారణంగా శరీరం విటమిన్లను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్ల లోపం కూడా కలుగుతుంది.
 
3. రక్త పీడనంలో పెరుగుదల మరియు నిద్రలేమి వంటివి బరువు తగ్గించే మాత్రల వలన కలిగే అదనపు దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా, కొంతమందిలో ఈ మాత్రల వలన పెరిగిన రక్తపీడనం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను కూడా గమనించారు.
 
4. బరువు తగ్గించే మాత్రల వలన గుండెపోటు వంటి సమస్యలు మాత్రమే కాకుండా, శరీరం యొక్క సామర్థ్యాన్ని తగ్గించి అసౌకర్యాలకు గురి చేస్తుంది. దీనితో పాటుగా పేగు కదలికలను కూడా అధికం చేస్తాయి. బరువు తగ్గించే మాత్రల వలన మానసికంగా మరియు శారీరకంగా భాదపడాల్సి వస్తుంది.