బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (11:12 IST)

పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 26 మంది మృత్యువాత

పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 26 మందికి పైగా ప్రజలు చనిపోయినట్టు సమాచారం. ఈ దేశంలో ఇటీవలికాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ భూకంపం సంభవించింది. దీంతో పశ్చిమ ప్రావిన్స్‌లోని బాద్గీస్ ఏరియా, ఖదీస్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
 
ఈ శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది బాధితులు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది.