శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (15:09 IST)

రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్.. రూ.119లకే కొత్త ప్లాన్

jioservice
రిలయన్స్ జియో కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.  ఈ ప్లాన్ ధర కేవలం రూ.119 మాత్రమే. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్లకు పోటీ ఇవ్వడానికి రిలయన్స్ జియో ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. 
 
జియో అందిస్తున్న ఈ ప్లాన్ ద్వారా మీరు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్‌ల ఉచిత సబ్‌స్ట్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అలాగే వినియోగదారులు ప్రతిరోజు 1.5జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు. మొత్తం 14 రోజులకు గాను 21 జిబి డేటా లభిస్తుంది. 
 
డైలీ డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 కేబిపిఎస్ వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.