శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (17:28 IST)

పిల్లలు ఎక్కువగా బిస్కెట్లు తింటే..? పండ్లను స్నాక్స్‌గా..?

Biscuits
సాధారణంగా, పిల్లలు బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడి తింటున్నారని కొనిపెట్టకూడదు. కానీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బిస్కెట్లు ఎక్కువగా తింటే పిల్లల జీర్ణశక్తి తగ్గిపోతుందన్నారు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా బిస్కెట్లు వాడటం ఆరోగ్యకరం కాదని, అనారోగ్య కారణాలతో ఆహారం తినలేని సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు. 
 
పిల్లలకు పౌష్టికాహారమే సరిపోతుందని, బిస్కెట్లను ఎప్పుడూ ప్రత్యామ్నాయం చేయకూడదని తెలిపారు. బిస్కెట్లకు బదులు పండ్లను స్నాక్స్‌గా పెట్టవచ్చని, పిల్లలకు మితంగా బిస్కెట్లు ఇస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.