సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (18:57 IST)

స్పైసీ పీత కూర ఎలా తయారు చేయాలంటే?

crab gravy
crab gravy
క్రాబ్ గ్రేవీ చేయడానికి కావలసిన పదార్థాలు:
 
పీతలు : ఆరు 
మిర్చి  : 8
జీలకర్ర : ఒక టీస్పూన్ 
ఉల్లిపాయలు : ఆరు 
ఆవాలు : ఒక టీస్పూన్
కొబ్బరి తురుము- ఒక కప్పు 
 
తయారీ విధానం:
ముందుగా పీతలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై కారం, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, కొబ్బరి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మసాలాను పీతలకు జోడించాలి. అలాగే ఉప్పు, పసుపు, పొడి వేసి 15 నిమిషాలు నానబెట్టి పక్కనబెట్టాలి. ఆపై బాణలిలో నూనె పోసి పీతలను నూనెలోనే వేపాలి. కావాలనుకుంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేపుకోవచ్చు. ఆ తర్వాత నాలుగు గ్లాసుల వరకు నీరు పోయాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత గ్రేవీలా వచ్చాక దించేయాలి. అంతే క్రాబ్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.