శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (13:38 IST)

చేపల పకోడీలు తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
చేపలు - పావుకిలో
మొక్కజొన్న పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 1
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చేపముక్కలను బాగా కడిగి అందులోని ముల్లులను తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్నచిన్నగా కోసుకోవాలి. ఆపై ఓ గిన్నెలో మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నీరుపోసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో చేపముక్కల్ని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పకోడీలు మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి చేప మిశ్రమాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే... వేడివేడి చేపల పకోడీలు రెడీ.