గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (16:27 IST)

తులరాశి జాతకులు ఇలా ఉంటారట...

తులారాశిలో జన్మించిన జాతకులు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ జాతకులు సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడంలో అధిక శ్రద్ధ వహిస్తారని పండితులు చెబుతున్నారు. ఇతరులను ఆకట్టుకునే విధంగా అందంగా ఉంటారని కూడా చెప్తున్నారు.
 
జీవితంలో తలెత్తిన విషాద సంఘటనలకు బాధపడకుండా ఉపాయంతో లక్ష్యాలను చేరుకునే విధంగా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఎత్తులకు పై ఎత్తులకు వేయడంలో మంచి మనసు గలవారు. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలోను రాజీ పడకుండా శ్రమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రజాకర్షణ ఎక్కువగా ఉండే వృత్తి ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు.
 
ఈ జాతకులకు సన్నిహిత వర్గం అండదండలు వెన్నంటి ఉంటాయి. ఇంకా ఈ జాతకులు ఉన్నత స్థానాలను అధికమించాలంటే.. లక్ష్మీదేవికి పూజలు చేయడం శ్రేయస్కరం. అదేవిధంగా అమావాస్య రోజున హనుమాన్ ఆలయాల్లో నేతితో దీపారాధన చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.