ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:11 IST)

లక్ష్మీదేవి ఆరాధన ఫలితం... అంతా మేలు కలుగుతుంది...

జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి

జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
    
 
ధనాన్ని ప్రసాందించేది లక్ష్మీదేవి అనే విషయం అందరికి తెలిసిందే. ఆ తల్లి ప్రీతి చెందేలా చేస్తేనే ఆమె అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజునా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు. తల్లిదండ్రులను, అతిథులను సేవించేవారి ఇంట, దానధర్మాలు చేస్తూ మూగజీవాల పట్ల దయను చూపించే వారియందు అమ్మవారు ప్రీతిని కలిగి ఉంటారని పురాణాలలో చెప్పబడింది.