గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2022 (23:20 IST)

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే

saibaba
శిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె ముక్క వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్లిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో.. తల్లీ నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు.

 
ఆమె ఆశ్చర్యంతో నేను మీకు ఎప్పుడు రొట్టె పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలో నేను ఎప్పుడూ వుంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటూ వుండు. నీకెంతో మేలు కలుగుతుంది. మశీదులో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అన్నారు సాయిబాబా.