సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..
భక్త సులభుడు, కోరిన కోర్కెలను అడగగానే తీర్చే భోలాశంకరుడు, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈ వ్రతం ఎలా చేయాలంటే చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో స్నానం చేస్తూ ఓం నమశ్శివాయ అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి.
స్నానంతరం శివపార్వతుల అష్టోత్తరం, అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి.
ఒంటిపూట భోజనం చేయుట. రోజులోని మూడు పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం.. ఉదయం నుండి ఉపవాసము ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయాలి. ఈ రోజు నువ్వులను దానం చేయాలి.