శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (18:00 IST)

దేవుడికి ఉపవాసం వుంటే పుణ్యం వస్తుందంటారు, కానీ షిర్డీ సాయి వద్దన్నాడు (Video)

ఉపవాసం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. భగవంతుడు వద్ద కోరిన కోర్కెలు నెరవేరాలంటే ఉపవాస వ్రతం పాటించాలని విశ్వాసం. ఐతే షిర్డీ సాయిబాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు.
 
ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు.