శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (21:38 IST)

పీవీ సింధు చీరకట్టు డ్యాన్స్ సూపర్.. వీడియో వైరల్

PV Sindhu
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చీరకట్టులో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్టులో చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ 'జిగిల్ జిగిల్'లో పాటకు డ్యాన్స్ చేసింది.
 
చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్‌లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  
 
చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. డిసెంబర్‌లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతోంది.