శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (13:38 IST)

మెుక్కజొన్న హల్వా తయారీ విధానం....

మొక్కజొన్నలో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మొక్కజొన్న గింజలను తీసుకుంటే ఒక రోజులో అవసరమైన విటమిన్‌ ఏ 6 శాతం శరీరానికి సమకూరుతుంది. విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విష

మొక్కజొన్నలో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మొక్కజొన్న గింజలను తీసుకుంటే ఒక రోజులో అవసరమైన విటమిన్‌ ఏ 6 శాతం శరీరానికి సమకూరుతుంది. విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అటువంటి మెుక్కజొన్నతో హల్వా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మొక్కజొన్న కండెలు - రెండు 
పాలు - 1 కప్పు 
నెయ్యి - అరకప్పు 
చక్కెర - అరకప్పు 
యాలకులు - నాలుగు 
జీడిపప్పు, బాదం, పిస్తా - ఒక్కొక్కటీ
 
తయారీ విధానం:
ముందుగా మొక్కజొన్న గింజలను నీళ్లల్లో కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన గింజలను మిక్సీలో వేసి పేస్టులా గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు బాదం పప్పును గంటపాటు నీళ్లల్లో నానబెట్టి వాటిపైన ఉండే పొట్టును తీసి చిన్న ముక్కలు చేయాలి. జీడిపప్పు, పిస్తాలను చిన్న పలుకులుగా చేయాలి. యాలకులను పొడిలా దంచాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి అది కరిగిన తరువాత అందులో మొక్కజొన్నగింజల పేస్టును వేయాలి.

ఈ పేస్టు బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ స్టవ్‌ మీద ఉడికించాలి. గరిటెతో పేస్టును ఆపకుండా కలపాలి. పెద్ద మంట పెట్టొద్దు. మొక్కజొన్న గింజల పేస్టు బాగా దగ్గరపడిన తరువాత అందులో పాలు, చక్కెర వేసి కలపాలి. చిన్న మంటపై దీన్ని కాసేపు ఉడికించాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతుండాలి. హల్వా చిక్కగా అయిన తరువాత అందులో బాదం, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించేసుకోవాలి. అంతే మెుక్కజొన్న హల్వా రెడీ.