ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (10:14 IST)

అయ్యప్ప స్వామిపై కామెంట్లు చేస్తే అలా వదిలేస్తారా?

rajasingh
అయ్యప్ప స్వామి, విష్ణువుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. 
 
ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ షేర్ చేసిన వీడియోలో పోలీసులను ప్రశ్నించారు. వారి వసూళ్లకు పోలీసులకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. 
 
హిందూ దేవుళ్లను అవమానించిన ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్పపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేపడతామన్నారు.