సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (21:03 IST)

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. బాలికలదే పైచేయి

students
తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన పాలిసెట్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. 
 
ఈ ఫలితాల్లో 82.7 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బు రెండవ ర్యాంక్ సాధించాడు.
 
ఇకపోతే... మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43, 573 మంది అమ్మాయిలు వున్నారు.