ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (18:14 IST)

నెగిటివ్ టాక్ లోనూ విజయ్ దేవరకొండ లైగర్ కలెక్షన్స్

Vijay Devarakonda
Vijay Devarakonda
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతున్నది. హీరోగా విజయ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా కలిసి లైగర్ ను బాక్సాఫీస్ వద్ద తలెత్తుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. ప్రతికూల ఫలితంలోనూ ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకోవడం అది విజయ్ క్రేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.
 
ఈ నెంబర్స్ చూస్తుంటే ..ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన నెక్ట్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆయన సమంతతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ విజయ్ ఖాతాలో ఉన్నాయి.