మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (13:22 IST)

క్యాప్సికమ్ గ్రేవీని మీరు టేస్ట్ చేశారా?

క్యాప్సికమ్ లో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అధిస్తాయి. అంతే కాదు జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక మినిరల్స్ క్యాప్సికమ్ లో నిండి ఉ

క్యాప్సికమ్ లో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అధిస్తాయి. అంతే కాదు జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక మినిరల్స్ క్యాప్సికమ్ లో నిండి ఉన్నాయి. ఇంకా క్యాప్సికమ్ లో ఔషధగుణగణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి క్యాప్సికమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును.
 
కావలసిన పదార్థాలు:
‌‌క్యాప్సికమ్ ‌: అరకేజీ
‌‌‌ఉప్పు ‌: తగినంత
కాశ్మీరీ మిర్చిపౌడర్ ‌: 50 గ్రాములు 
‌ఇంగువ : 5 గ్రాములు 
‌‌ఏలుకల పొడి : ‌‌30 గ్రాములు 
పెరుగు : ఒక కప్పు
‌నెయ్యి : అరకప్పు 
‌‌ఉప్పు : ‌‌తగినంత
నూనె ‌: వేపుడుకు సరిపడా
‌‌తురిమిన పనీర్‌ ‌: ‌‌300 గ్రాములు 
జీడిపప్పు ‌: వంద గ్రాములు 
‌కిస్‌మిస్‌ ‌: వంద గ్రాములు 
‌‌ఏలకుల పొడి ‌: ‌‌1/2 స్పూన్
కొత్తి మీర ‌: పావు కప్పు 
‌తరిగిన పచ్చిమిర్చి ‌: పావుకప్పు 
 
తయారీ విధానం:
ముందుగా క్యాప్సికమ్‌ను గాట్లు పెట్టి గింజల్ని తీసి నూనెలో సన్నటి మంట మీద డీప్ ప్రై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిని కలిపి క్యాప్సికమ్‌లో కూరిపెట్టుకోవాలి. ఇంతలో స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేగాక ఇంగువ, పెరుగు వేసి కలిపి స్టఫ్‌ చేసిన క్యాప్సికమ్‌తో పాటు గ్రేవీకి తీసుకున్న పదార్ధాలన్నింటినీ సన్న మంట మీద మగ్గనివ్వాలి. దీనికి పావులీటరు నీటిని కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మంట తగ్గించి మరో రెండు నిమిషాలపాటు ఉడికించి చివరగా మెంతిపొడి, కొత్తిమీర చల్లి దించాలి. అంతే క్యాప్సికమ్ గ్రేవీ రెడీ.