గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:54 IST)

హైదరాబాద్: ‘మైనర్ బాలిక కిడ్నాప్, రేప్’

rape
హైదరాబాద్ డబీర్‌ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసు నమోదు అయింది. డబీర్ పురాకు చెందిన మైనర్ అమ్మాయిని ఇద్దరు యువకులు కలిసి, నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి రెండు రోజులు అత్యాచారం చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ముందుగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. తరువాత అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు. అప్పుడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం రేప్ కేసు కూడా పెట్టారు.

 
వెంటనే ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యి, అమ్మాయిని విచారించిన తరువాత ఘటన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. నిందితులు రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన వారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 
సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం లాడ్జీకి ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విచారణ పూర్తయిన తరువా పూర్తి వివరాలు తెలియజేస్తామని డబీర్ పుర ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు.