ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (22:20 IST)

స్మార్ట్‌ఫోన్‌ల వాడకం.. పిల్లలకు ఇచ్చే ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు..!

smartphone kids
smartphone kids
కరోనా కాలంలో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ తరగతుల ప్రభావం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ వాడకం నుంచి కోలుకోలేక పోయేలా చేసింది. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల చేతుల్లో కూడా స్మార్ట్‌ఫోన్ భాగం అయ్యింది. పిల్లలను కట్టడి చేసేందుకు వారి చిలిపి చేష్టలను అదుపు చేసేందుకు తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు చేతికి ఇచ్చే పరిస్థితి నెలకొంది.
 
అందుకే ఏడాది వయసున్న చిన్నారులు కూడా సెల్‌ఫోన్‌లోని అప్లికేషన్‌లను అందంగా హ్యాండిల్ చేయడం అలవాటు చేసుకున్నారు. పిల్లలు ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లలో వీడియోలు చూడటం లేదా వీడియో గేమ్‌లు ఆడటం వంటివి చేస్తుంటే మెడ భాగం స్ట్రెయిన్ అవ్వడం ప్రారంభమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చివరికి నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. 
 
పిల్లలు తల దించుకుని సెల్ ఫోన్ వైపు చూడటం ప్రమాదకరం. ఇది అకస్మాత్తుగా మెడ నొప్పికి దారితీస్తుంది. భుజం నొప్పి చివరికి వెన్ను నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ వైపు చూడనివ్వకూడదని వారు వార్నింగ్ ఇస్తున్నారు. తప్పనిసరి సమయాల్లో నిటారుగా కూర్చోవడం అలవాటు చేయాలి. 
 
ఎందుకంటే విద్యా సంబంధిత అప్లికేషన్లు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో అధికంగా అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి. అయితే పిల్లలు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల మెడ నొప్పి రావడమే కాకుండా మెదడు అలసటకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా వుంచడం మంచిది.