గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (13:37 IST)

పిల్లన్ని ఎలా చదివించాలంటే..?

రోజూ.. పిల్లలు ఇంటికి వచ్చిన మొదలు చదువూ, హోంవర్క్‌తోనే సరిపోతుంది. అలాంటప్పుడు వారికి గదిని ప్రత్యేకంగా ఉంచాలి. చిన్నారుల గదిలో గాలీ, వెలుతురూ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలానే విద్యుత్ బల్బుల విషయాని కొస్తే అవి బాగా కాంతివంతంగా వెలిగేవి అమర్చాలి. అలాకాకుండా కాస్తే వెలుతులు తగ్గితే గదిలో కాంతివిహీనంగా అనిపిస్తుంది. దాంతో ఆ ప్రభావం మనసుపై పడుతుంది. 
 
కిటికీ.. లేకుంటే ఓ పక్కన టేబుల్ మీద పచ్చని మొక్కను ఏర్పాటు చేయాలి. అది ఆక్సిజన్‌ను అందించడమే కాకుండా.. మనసులో సానుకూల ఆలోచనలకు దోహదం చేస్తుంది. దాంతోపాటు తాజా పువ్వులతో వాజ్ ఉంచితే తెలియకుండాలనే మనసును ఆ పువ్వులు, ఉత్తేజితం చేస్తాయి. గదిలో లేత రంగు కాకుండా ముదురువి ఎంచుకుంటే మంచిది.
 
ప్రకాశవంతంగా కనిపించే రంగులు మెదడు చురుగ్గా ఉండడానికి సహాయపడుతాయి. అందుకు దుప్పటీ, దిండు గలేబులూ, కర్టెన్లూ, కార్పెట్ వంటివి వర్ణరంజితంగా ఉండేలా చూసుకోవాలి. చిన్నారుల గదిలో పుస్తకాల అల్మరా తప్పనిసరిగా ఉండాలి. అందులో ఆసక్తికరంగా అనిపించే పుస్తకాలను అమర్చుండాలి. అప్పుడే.. వారికి ఎదురుగా కనిపిస్తున్నప్పుడి తీసి చదువుతారు.
 
పజిళ్లూ, పుస్తకాలు, రూబిక్స్ క్యూబ్, చదరంగం, ఇలా ఇండోర్ గేమ్‌లకు సంబంధించినవి ఓ అరలో ఉంచాలి. ఇవన్నీ చిన్నారుల మెదడుకు మేతలాంటివి. ఆలోచనా శక్తినీ, చురుకుదనాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.