సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By ఎంజీ
Last Modified: శనివారం, 2 అక్టోబరు 2021 (11:05 IST)

చరిత్రలో ఈరోజు... అక్టోబర్ 2 న ఏం జరిగింది?

సంఘటనలు
 
1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
 
2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
 
1966 భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.
 
2006 : డా. జయప్రకాశ్ నారాయణ్ చే లోక్ సత్తా పార్టీ స్థాపించబడినది

 
జననాలు
1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
 
1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
 
1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
 
1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ  ప్రధానమంత్రి. (మ.1966)
 
1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
 
1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)
 
1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
 
1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992)
 
1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
 
1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
 
1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.
 
1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
 

మరణాలు
 
1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
 
1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
 
1975 : తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు, భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ మరణం (జ.1903).
 
1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896)
 

పండుగలు , జాతీయ దినాలు
 
గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )
 
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
 
అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.