శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (23:37 IST)

పచ్చి మిరపకాయలు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Chilli
పచ్చి మిరపకాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటిని తినడం వల్ల మనకు కేలరీల కంటే శక్తి ఎక్కువగా వస్తుంది. పచ్చిమిరపలో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపించివేస్తాయి. తద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు, గుండె వ్యాధులు రాకుండా పచ్చిమిర్చి మేలు చేస్తుంది.
 
రక్తంలోని కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి.
 
వీటిల్లో మంట అనిపించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి సహకరిస్తుంది. 
 
జలుబు, సైనస్ ఉన్నవారికి పచ్చిమిరప సహజ ఔషధంగా పని చేస్తుంది.శ్లేష్మం పలుచబడి ఉపశమనం లభిస్తుంది.
 
పచ్చిమిర్చిలో విటమిన్ సి, బీటాకెరోటిన్ ఉండటం వల్ల కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి.
 
పచ్చిమిర్చి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో తీసుకోవచ్చు.
 
పచ్చిమిర్చిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.
 
పచ్చి మిరపకాయలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి.