మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 జనవరి 2023 (19:20 IST)

లెట్‌ టైమ్‌ వెయిట్‌‌ను విడుదల చేసిన లగ్జరీ బాత్‌ వేర్‌ బ్రాండ్‌, క్యుయో

image
హింద్‌వేర్‌ లిమిటెడ్‌కు చెందిన అగ్రగామి లగ్జరీ బాత్‌ వేర్‌ బ్రాండ్‌ క్యుయో తమ నూతన టీవీసీ విడుదల చేసింది. ‘లెట్‌ టైమ్‌ వెయిట్‌’ అంటూ తీర్చిదిద్దిన ఈ టీవీసీలో  సుప్రసిద్ధ భారతీయ నటి, ప్రొఫెషనల్‌ థయేటర్‌ ఆర్టిస్ట్‌ అహానా కుమ్రా కనిపించనున్నారు. ఈ నూతన టీవీసీ ప్రచారంతో, లగ్జరీ బాత్‌వేర్‌ బ్రాండ్‌గా తమ స్ధానాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటుగా డిజైన్‌ మరియు ఆవిష్కరణల సమ్మేళనంగా నిలిచే యూరోపియన్‌ బాత్‌ లాంజ్‌లను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీవీసీతో పాటుగా ఈ చిత్రం అత్యంత సౌకర్యవంతంగా ప్రింట్‌, డిజిటల్‌, ఓఓహెచ్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ తో  మిళితమవుతుంది.
 
విలాసవంతమనే ఆలోచనలను క్యుయో ప్రతిబింబిస్తుంది. విస్తృత శ్రేణి సమకాలీన డిజైన్స్‌, వినూత్నమైన పనితీరు కలిగి ఉండటంతో పాటుగా పునరుత్తేజ అనుభవాలను వినియోగదారులు పొందేందుకు తోడ్పడుతుంది. ఈ బాత్‌ రూమ్‌ శ్రేణి ప్రీమియం, యూరోపియన్‌ బాత్‌ లాంజ్‌ల కనీస ప్రాతినిధ్యం చూపుతుంది. ఈ కలెక్షన్‌ను చూడగానే ఆకట్టుకునేలా, అత్యున్నత మన్నిక ఉండే రీతిలో తీర్చిదిద్దారు.
 
ఈ ప్రచారం గురించి హింద్‌వేర్‌ లిమిటెడ్‌, బాత్‌ అండ్‌ టైల్స్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ సుధాంశు పోఖ్రియాల్‌ మాట్లాడుతూ, ‘‘శానిటరీవేర్‌ మరియు ఫేసెట్స్‌ విభాగంలో అగ్రగామి సంస్థగా మేము ఎప్పుడూ కూడా తుది వినియోగదారులతో వారికి అత్యంత  కీలకమైన అనుభవాలతో అనుసంధానితమై ఉంటాము.  లగ్జరీ బాత్‌ లాంజ్‌లను సృష్టించాలనే మా సిద్ధాంతానికి అనుగుణంగా, మేము మా బ్రాండ్‌ ప్రచారం లెట్‌ టైమ్‌ వెయిట్‌ను మా బ్రాండ్‌ క్యుయో కోసం విడుదల చేశాము.  అత్యంత ఆహ్లాదకరమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్‌లను తమ బాత్‌ స్పేస్‌లో కావాలనే వినియోగదారులు మా ప్రచారాన్ని అభినందించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా హింద్‌వేర్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చారు మల్హొత్రా మాట్లాడుతూ ‘‘ఈ నూతనంగా విడుదల చేసిన ప్రచారం ‘లెట్‌ టైమ్‌ వెయిట్‌’అనేది సమగ్రమైన 360 డిగ్రీ ప్రచారం. ఇది ప్రింట్‌,డిజిటల్‌,ఓఓహెచ్‌, ఓటీటీ వంటి విభిన్న ప్లాట్‌ఫామ్స్‌ యొక్క సౌకర్యవంతమైన సమ్మేళనం. ఈ ప్రచారం ద్వారా అత్యున్నత బాత్‌ స్పేస్‌ అంటే  క్యుయో మించినది లేదు అని పునరుద్ఘాటిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఇంక్‌నట్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ జహంగీర్‌ ఇర్రోనీ మాట్లాడుతూ ‘‘క్యుయో యొక్క యూరోపియన్‌ లగ్జరీని జీవితానికి తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ఉత్పత్తులు అత్యంత సున్నితమైనవి మరియు నిస్సందేహంగా ఈ షోకు స్టార్స్‌గా వెలుగొందుతాయి. మేము ఈ బ్రాండ్‌ యొక్క విలువలు విని, అర్ధం చేసుకున్న తరువాత, సొగసైన, తెలివైన, అధునాతనమైన వ్యక్తిని నటింపజేయాలనుకున్నాము. అందుకే అహానా కుమ్రాను సరైన ఎంపికగా భావించాము. మొత్తంమ్మీద, క్యుయో టీమ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం’’ అని అన్నారు.