#EidMubarak : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు... కిటకిటలాడుతున్న ఈద్గాలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే ఈద్గాలు కిటికిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని మక్కా మసీదుతో పాటు.. మీరాలంమండి, మాదన్నపేట ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు.

ramzan
pnr| Last Updated: శనివారం, 16 జూన్ 2018 (09:10 IST)
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే ఈద్గాలు కిటికిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని మక్కా మసీదుతో పాటు.. మీరాలంమండి, మాదన్నపేట ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా సిటీలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని 600 మసీదుల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర వ్యాప్తంగా 5 వేల మంది సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.
 
రంజాన్ పండుగ సందర్భంగా గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 
 
ఇతరులను గౌరవించడం, పవిత్రమైన జీవితాన్ని గడపడం, అందరి విశ్వాసాలు, గౌరవాన్ని కాపాడేలా ఈదుల్-ఫిత్ ముస్లింలతో ప్రతిజ్ఞ చేయిస్తుందని తమతమ సందేశాల్లో గుర్తుచేశారు. కాగా, రంజాన్ మాసమంతా భక్తిశ్రద్ధలతో ప్రత్యేకప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షను కొనసాగించిన విషయం తెల్సిందే. ఈ ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి. దీనిపై మరింత చదవండి :