మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 మే 2022 (23:53 IST)

ఇస్లామ్‌కి సంబంధించి ఐదు ముఖ్యాంశాలు

eid mubarak
అల్లాహ్ ఆజ్ఞల్ని పాటించడం ముస్లిమయిన ప్రతి వ్యక్తి తప్పనిసరి విధి. ఈ విశ్వాసాలు, ఈ ఆజ్ఞాపాలననే ఈమాన్ అని, ఇస్లామ్ అని అంటారు. ఇస్లామ్‌కి సంబంధించి 5 ముఖ్యాంశాలు.

 
1. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు కారనీ, మహ్మద్ అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని విశ్వసించడం.
2. రేయింబవళ్లలో అయిదు పూటలా నమాజ్ చేయడం.
3. రంజాన్ నెలలో రోజూ వ్రతాన్ని పాటించడం.
4. జకాత్‌ని చెల్లించడం.
5. శక్తి స్తోమతులు వున్నవారు హాజ్‌కై కాబా... మక్కా పవిత్ర యాత్రను చేయడం.