శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (14:20 IST)

జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి అనేది చాలా మందని తొలిచివేసే ప్రశ్న. శాస్త్రవేత్తలు సైతం చాలా సంవత్సరాలుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. జీబ్రాలు తమను వేటాడే జంతువులను అమోమయానికి గురిచేయడానికి, అలాగే శరీరానికి చల్లదనాన్ని చేకూర్చుకోవడానికి చారలను కలిగి ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. 
 
యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై జరిపిన పరిశోధనలలో జీబ్రాలకు చారలు ఎందుకు ఉంటాయో తేల్చి చెప్పారు. ఇందుకు వారు ఒక ప్రయోగాన్ని చేసారు. గుర్రాలపై జీబ్రాల మాదిరి చారలు ఉండే కోట్‌లను కప్పి కొన్ని రోజులు వాటిని పరిశీలనలో ఉంచారు. గుర్రాలపై ఈగలు వాలకపోవడాన్ని వారు గమనించారు. 
 
అంతేకాదు చారల కోట్స్ వలన గుర్రాలపై ఈగలు వాలడం, కుట్టడం 25 శాతం తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు. కాగా జీబ్రాలపై ఉండే చారలు ఈగలను అమోమయానికి గురి చేయడం వల్లే అవి వాటిపై వాలడం లేదని నిరూపించారు.