శ్రీవారి భక్తుల కోసం టీటీడీ గోవిందా యాప్
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. ఇక భక్తులకు శ్రమ వుండదు. తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు గోవిందా యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గోవింద యాప్‌లో పొందవచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్ చూసి బుక్ చేసుకోవచ్చు.
ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునే వారికి యాప్‌లోనే హుండీ వుంటుంది.