బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (13:46 IST)

మియామి ఓపెన్.. ఫైనల్లోకి చేరిన రోహన్ బోపన్న జోడీ

Rohan Bopanna
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు రోహన్ బోపన్న- అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్‌లో మార్సెల్ గ్రానోల్లర్స్- హొరాసియో జెబల్లోస్‌లను ఓడించి సీజన్‌లో వారి రెండవ ఫైనల్‌కు చేరుకున్నారు.ఈ ఏడాది జనవరిలో అతను సాధించిన ఏటీపీ జాబితాలో ప్రపంచ నెం.1 ర్యాంకింగ్‌ను తిరిగి పొందాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో తొలి గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌లో విజేతగా నిలిచిన టాప్‌ సీడ్‌ బోపన్న, గురువారం జరిగిన సెమీఫైనల్లో ఎబ్డెన్‌ 6-1, 6-4తో గ్రానోల్లర్స్‌, జెబల్లోస్‌పై విజయం సాధించారు.


44 ఏళ్ల బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ 1000 ఫైనల్, మియామీలో మొదటిది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 25 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాడు బోపన్నకు ఇది 63వ ఏటీపీ టూర్ లెవల్ ఫైనల్ కావడం విశేషం.