శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (10:30 IST)

కవల సోదరీమణుల భరతనాట్యం అరంగేట్రం- భక్త రామదాసు కూర్చిన మంగళం

Bharatanatyam Arangetram by NRI Twins
Bharatanatyam Arangetram by NRI Twins
శాన్ ఫ్రాన్సిస్కోలోని మిల్పిటాస్‌కు చెందిన సాధన శ్రీకాంత్, సంయుక్త శ్రీకాంత్ అనే 14 ఏళ్ళ కవలల భరతనాట్య అరంగేట్రం (సాఫ్టువేర్ ఇంజనీరుగా ఉన్న శ్రీకాంత్, ప్రియ దంపతుల కుమార్తెలు)  

NRI Twins
NRI Twins
 
సన్నీవేల్ ప్రాంతానికి చెందిన గురు చిత్ర వెంకటరమణి వద్ద ఐదో ఏట నుంచే శిక్షణ పొందుతున్నారు. త్వరలో హైస్కూలులోకి ప్రవేశిస్తున్న వీరిద్దరూ భరతనాట్యంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర నుంచి లోయర్ డిప్లొమా పట్టాలను సాధించారు.
Bharatanatyam Arangetram by NRI Twins
Bharatanatyam Arangetram by NRI Twins
 
ప్రదర్శించిన అంశాలు: పుష్పాంజలి - గణేశ స్తుతి (హంసధ్వని రాగం), జతిస్వరం (ఆరభి రాగం), నరసింహ కవుత్వం (రాగమాలిక), వర్ణం (రాగమాలిక), తిరుప్పావై (రాగమాలిక), శివ తాండవం (రాగమాలిక), సీతా స్వయంవరం - కళ్యాణం (రాగమాలిక), తిల్లాన (మోహనకల్యాణి రాగం), మంగళం. 
Bharatanatyam Arangetram by NRI Twins
Bharatanatyam Arangetram by NRI Twins
 
నరసింహ కవుత్వం అంశంలో ముగ్గు మీద నాట్యమాడుతూ రూపొందించిన నరసింహ స్వామి చిత్రం ఆహూతులను అలరించింది. వర్ణం, శివ తాండవం అంశాలు కార్యక్రమానికి తలమానికంగా నిలిచాయి. 
NRI Twins
NRI Twins


భక్త రామదాసు కూర్చిన మంగళం ప్రేక్షకులను ఉత్సాహపరచింది. ఆద్యంతం సందర్భానుసారంగా ప్రసరింపజేసిన రంగుల కాంతులు కార్యక్రమ వన్నెను ఇనుమడింపజేశాయి.

NRI Twins
NRI Twins
 
గాత్ర, వాద్యబృందం: 
నృత్య దర్శకత్వం, నట్టువాంగం: గురు చిత్ర వెంకటరమణి
మృదంగం: కె. ఆర్. వెంకట సుబ్రమణియన్
గాత్రం: ఎ. వి. ఆర్ రోషిణి 

Bharatanatyam Arangetram by NRI Twins
Bharatanatyam Arangetram by NRI Twins
వయొలిన్: టి. వి. సుకన్య 
వేణువు: అతుల్ కుమార్ రంగరాజన్ 
అలంకరణ : ఎస్. ఆల్బర్ట్
కేశాలంకరణ : జి. రవిచంద్రన్

Bharatanatyam Arangetram by NRI Twins
Bharatanatyam Arangetram by NRI Twins
 
మైలాపూరులోని ఆర్‌ఆర్ సభలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆహుతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మిల్పిటాస్ (అమెరికా), కేరళ నుంచి వచ్చిన ఆత్మీయులు, తోటి కళాకారిణులు సాధన, సంయుక్తలను ప్రత్యేకంగా అభినందించారు.