శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 ఆగస్టు 2020 (23:26 IST)

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?

అనేక ఆరోగ్య సమస్యలు అధికంగా మంచినీటి తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చన్నది వైద్యుల మాట. అవేమిటో తెలుసుకుందాం.
 
మలబద్ధకం: నీటిని తాగడం వల్ల మలబద్ధకం లేకుండా సహాయపడుతుంది.
 
క్యాన్సర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగేవారికి మూత్రాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
 
కిడ్నీలో రాళ్ళు: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
 
మొటిమలు, చర్మ హైడ్రేషన్: చర్మం హైడ్రేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి నీరు ఎలా సహాయపడుతుందనే దాని గురించి చాలామంది ఏవేవో చెప్పారు. ఐతే ఏ అధ్యయనాలు దీనిని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.