ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 మే 2021 (22:01 IST)

వివాహితులు కాలి రెండో వేలికి మాత్రమే మెట్టెలు ధరించాలట..?!

Leg Finger Ring
పూజలు, వాస్తు సంబంధిత విషయాలపై కాస్త జాగ్రత్తలు అవసరం. మహిళలు పూజాది కార్యక్రమాల పట్ల అధిక శ్రద్ధ వహించాలని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ముందుగా ఇంటిముందు ముగ్గులు వేసేటప్పుడు దక్షిణం వైపు నిల్చుని వేయకూడదు. ఉత్తరం లేదంటే సూర్యుడు ఉదయించే దిశవైపు నిల్చుని ముగ్గుపెట్టాలి. వాకిలిలో పసుపు నీరు చల్లడం మరిచిపోకూడదు. 
 
గర్భవతులు ఉగ్రరూపంలో వున్న దేవతల ఆలయాలకు వెళ్ళకూడదు. ఇంకా వ్రతమాచరించాల్సిన అవసరం లేదు. ఆలయాలకు వెళ్లడం మాత్రం చేయొచ్చు. వివాహితులు కాలి రెండో వేలికి మాత్రమే మెట్టెలు ధరించాలి. మూడో వేలికి ధరించకూడదు. ఇలా చేస్తే అనారోగ్యం తప్పదు. అలాగే భర్తకు ప్రతికూలత ఫలితాలు ఎదురవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆలయాల్లో ఇచ్చే తులసీ ప్రసాదాన్ని తలలో ధరించకూడదు. మంగళ, శుక్రవారాల్లో మహిళలు తలస్నానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచే మహిళల ఇంట లక్ష్మీ నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.