ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:20 IST)

యోనిసమస్యలు - సలహాలు

స్త్రీ జననాంగములోని స్థాయిలు..దీనిలో 3 నాడులుంటాయి. 1. సమీరణ----పై భాగంలో ఉంటుంది. 2. చాంద్రమతి --- మధ్య భాగంలో, 3. గౌరీ---- కింది చివర. పురుష వీర్యము సమీరణలో పడితే వ్యర్ధ మవుతుంది. చంద్రమతిలో పడితే ఆడపిల్ల, గౌరిలో పడితే  మగపిల్లవాడు పుడతారు.
 
మర్మాంగానికి, ఆసనానికి మధ్యగల స్థానములో మూలాధార చక్రము ఉంటుంది. దీనికొరకు ఆసనాలు :--
1.సుఖాసనంలో కూర్చోవాలి.కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టుకొని , కుడి  మోకాలును కుడి చేత్తో  ఊపాలి. అదే విధంగా ఎడమ వైపు కూడా చెయ్యాలి.ఆ విధంగా తొడపై కాలు పెట్టలేని వాళ్ళు పాదాన్ని తొడకు ఆనించి చెయ్యవచ్చు.

2. రెండు చేతులతో పాదాల వేళ్ళను పట్టుకొని రెండు  మోకాళ్లను పైకి కిందికి ఊపాలి.

3. పూర్తిగా వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి కాళ్ళను రెండు వైపులా వెడల్పు వెడల్పు చెయ్యాలి. చేసి కాళ్ళను ఊపాలి.
 
మర్మాంగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు :--
ఒక గ్లాసు వార్చిన గంజి ఏ సమయంలోనైనా తాగాలి.ప్రతి రోజు మినుములతో చేసిన ఏదో ఒక పదార్ధం అదే విధంగా నువ్వులతో చేసిన ఏదో ఒక పదార్ధం తప్పకుండా వాడుతుంటే మర్మాంగం  లో ఎలాంటి వ్యాధులు రావు.త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో వేసి ఆ నీటిలో మర్మాంగాన్ని కడుగుతుంటే ఎలాంటి వ్యాధులు రావు.
 
ఒక గిన్నెలో 5 గ్లాసుల నీళ్ళు పోసి దానిలో 5 పిడికిళ్ల వేపాకును నలిపి వేయాలి, దానికి 5 స్పూన్ల పసుపును  కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మూత్రానికి వెళ్ళినపుడు ఆ నీటితో కడుక్కుంటూ వుంటే యోని మార్గంలో  ఇన్ఫెక్షన్ లు రావు.
జిలకర            ---- 100 gr
ధనియాలు      ---- 100 gr
కలకండ          ---- 100 gr
 
జిలకర, ధనియాలను దోరగా వేయించి పోడులుగా చేసుకోవాలి దానికి కలకండ పొడి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.  ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున వాడుతూ వుంటే మర్మాంగంలో పుండ్లు పడకుండా నివారించ బడుతుంది.
 
స్త్రీ జననేన్ద్రియములో దురదలు  --- నివారణ                 
 
1. చందం పొడి, కొబ్బరి నూనె రెండింటిని కలిపి దురదల మీద పూస్తే తగ్గుతుంది.
 
2. ఉసిరిక పొడి 5 gr, తేనె 5 gr రెండింటిని  కలిపి పేస్ట్ లాగా చేసి చప్పరిస్తూ , మింగుతూ వుండాలి. ఈ విధంగా నెల రోజులు చేస్తే  మంటలు, దురదలు  తగ్గుతాయి.
 
3. శుద్ధి చేయబడిన గంధకం 2 gr, కొబ్బరి నూనె  ఒక టీ స్పూను రెండింటిని కలిపి పూస్తే తగ్గుతుంది. కాని మొదట టెస్ట్ డోస్ వాడి చూడాలి  ఫలితం వేరేగా వుంటే మానేయాలి.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు :---
తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను భుజించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి . మజ్జిగ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

జననాంగం లోని  మంట నివారణకు  --- ధాత్రి కషాయం:
అతిగా వేడి చేయడం వలన వస్తుంది .
ధాత్రి    =   ఉసిరిక
ఉసిరిక పొడి-- ఒక టీ స్పూను
పటికబెల్లం-- ఒక టీ స్పూను
నీళ్ళు-- ఒక గ్లాసు
నీళ్ళలో  ఉసిరిక పొడి వేసి సగం గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి . దీనిలో కలకండ కలుపుకొని తాగాలి.
 
సూచన :---
దీనితోబాటు ద్రాక్షరసం, దానిమ్మ రసం, ధనియాల కషాయం, బార్లీ జావ తాగాలి. బీరకాయ సొరకాయ వంటి కూరగాయలను వాడాలి. పులుపు ,  కారం తగ్గించి వాడాలి .