శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (19:17 IST)

పిల్లలకు ఆప్రికాట్స్ జ్యూస్‌తో తేనెను మిక్స్ చేసి ఇస్తే?

ఆప్రికాట్స్‌ను రోజుకు ఒకటి లేదా రెండు తీసుకోవడం లేదంటే.. జామ్స్, సలాడ్స్ రూపంలో తీసుకోవడం ద్వారానూ అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. జ్యూస్‌ల రూపంలో లేదా జామ్స్, స్క్వాష్ ద్వారా వీటిని తీసుకోవచ్చు. అలా ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని ఫైబర్ అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. 
 
ఆప్రికాట్స్‌లోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. హృద్రోగ సంబంధిత రోగాలకు చెక్ పెట్టాలంటే.. ఆప్రికాట్లను తీసుకోవడం ఉత్తమం. ఆప్రికాట్స్‌లో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు అధికంగా వున్నాయి. వీటిని తరచూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

అలాగే పిల్లల్లో ఏర్పడే జలుబు, దగ్గును పోగొట్టాలంటే.. ఎండిన ఆప్రికాట్స్‌ను జ్యూస్‌లా తయారు చేసి తేనెను కలిపి అందిస్తే మంచి ఫలితం వుంటుంది.