శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 21 జూన్ 2023 (18:54 IST)

నూతి బాపయ్య చౌదరి సేవలు అభినందనీయం: ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

image
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం పెదనందిపాడు తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి నాట్స్ తరఫున బాపయ్య చౌదరి చేతుల మీదుగా ఐదున్నర లక్షల రూపాయలను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, విజ్ఞాన కేంద్రాల జిల్లా కన్వీనర్ పాశం రామారావులకు అందజేయడం జరిగింది.
 
విజ్ఞాన కేంద్రాలు రాష్ట్రంలో బహుముఖ సేవా కార్యక్రమాలకు, విద్య, మహిళల స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లక్ష్మణరావు అన్నారు. పెదనందిపాడులో ఏర్పాటు కాబోతున్న ఈ విజ్ఞాన కేంద్రం ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి దోహదపడబోతుందని తెలిపారు. ఈ విజ్ఞాన కేంద్ర నిర్మాణానికి భూరి విరాళం అందజేసిన నాట్స్ బృందానికి, నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతికి అభినందనలు తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అమెరికాలోనూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ప్రత్యేకంగా మన గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి (బాపు)నూతి తెలిపారు.
 
విజ్ఞానకేంద్రం ఏర్పాటుకు బాపు నూతి చూపిన చొరవను నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా తమ సందేశం ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రాల జిల్లా కన్వీనర్ పాశం రామారావు, హరిబాబు, నరిసెట్టి ఆచారి, నర్రా బాలకృష్ణ  ప్రిన్సిపల్ రాఘవయ్య, వెలిశెట్టి రమణ, కాపు వెంకట సుబ్బారావు, దాసరి రమేష్, దాసరి వెంకట సుబ్బారావు, గెరా మోహన్ రావు, శీలం అంకారావు, కందుల శ్రీనివాసరావు, జంపని రామారావు, తదితరులు పాల్గొన్నారు.