గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:35 IST)

తీర్థం అంటే ఏంటి? తీర్థాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి?

బాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి.
 
తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. అందులో మొదటగా తీసుకునే తీర్థము ధర్మసాధన కోసం, ద్వితీయంగా స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, తృతీయంగా తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. తీర్థానికి ఇదే ప్రయోజనం.
 
ధర్మ సాధన కోసం ద్వితీయ ధర్మ సాధనం అని తీర్థాన్ని ఆస్వాదించాలి. అంటే ధర్మాన్ని సాధించుటలో ప్రవృత్తిని ఈ తీర్థం కలుగజేస్తుందని భావం. చివరకు అందరికీ కావలసింది మోక్షము. ఇది నిత్యమైనది. శాశ్వతమైంది. పునరావృత్తి లేనిది.