గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (16:31 IST)

వెల్లుల్లిపాయలు నూనెలో వేసుకుని ఫ్రిజ్‌లో నిల్వచేస్తే?

కూరగాయలు, ఆకుకూరలు పచ్చదనం కోల్పోకుండా ఉండాలంటే ఉడకించేటప్పుడు చిటికెడు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. వంకాయకూర చేసుకునేటప్పుడు పూర్తయ్యాక అందులో ధనియాలను ఆరచేతిలో వేసుకుని నలిపి కూరపై చల్లుకుని

కూరగాయలు, ఆకుకూరలు పచ్చదనం కోల్పోకుండా ఉండాలంటే ఉడకించేటప్పుడు చిటికెడు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. వంకాయకూర చేసుకునేటప్పుడు పూర్తయ్యాక అందులో ధనియాలను ఆరచేతిలో వేసుకుని నలిపి కూరపై చల్లుకుని మూతపెడితే ఘుమఘుమలాడుతుంది. టీ కాచుకునేటప్పుడు అందులో ఎండబెట్టిన నారింజ తొక్కలను వేసుకుంటే టీ చాలా రుచికరంగా ఉంటుంది.
 
వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పునూనె వేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే వెల్లుల్లి పాయలు చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందుగా వాటిని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే తరిగేటప్పుడు కళ్ళు మండవు. పచ్చిమిరపకాయలను పిన్నీసుతో ఐదు రంధ్రాలు చేసిన అనంతరం వేయించుకుంటే పగిలే గింజలు మీద పడవు. 
 
పప్పు త్వరగా ఉడకాలంటే అందులో ఉప్పును చివరగా వేసుకోవాలి. అరటిపూసలోని పీచు తీసేయాలంటే పూసను చిన్న చిన్న ముక్కలు తరిగి మజ్జిగలో చిలకరిస్తే పీచు కవ్వంతో తేలికగా వస్తుంది. గారెల పిండి రుబ్బేటప్పుడు రెండు గరిటెల అన్నం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చేయడం వలన గారెలు ఎంతో రుచిగా కరకరలాడుతుంటాయి.