ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మార్చి నెల 24వ తేదీన గుండెపోటు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హాటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, కిమ్ మృతిపట్ల సినీ ప్రియులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎన్వీయూ) పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా ఓ చిరుతపులి సంచరిస్తుండగా, అది ఎట్టకేలకుపట్టుబడింది. ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది.